Home Page

/images/17_yoga_july24.jpg

పదిహేడవ ఆయుర్వేద, యోగ శిక్షణా సప్తాహం నకు రిజిస్ట్రేషన్ ప్రారంభం.

ఆజీవనం అత్యంత ఉత్కృష్ట మైన హఠయోగ సాధన చేసిన యోగాచార్యులు శ్రీ రామ లింగ వెంకట సత్యనారాయణ గారిచే అతి ప్రాచీన మైన అష్టాంగ యోగ సాధన, మరియు ఆయుర్వేద జీవన విధానాన్ని అందరికీ అందించి ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణము ధ్యేయంగా ఉద్యమించిన వైద్య సుందర రాజ పెరుమాళ్ గారిచే ఆయుర్వేద శిక్షణా సప్తాహం నిర్వహింప బడుతుంది.  
ఆరోగ్యధాత్రి ఆయుర్వేద ఆశ్రమ ప్రాంగణము లో ఉచితముగా ఆవాసము, భోజన సౌకర్యములతో 26-07-24 నుండి 01-08-24 వరకు నిర్వహింప బడు ఈ శిబిరం లోని ముఖ్య అంశములు 

  1. సులువైన సూక్ష్మ వ్యాయామముల నుండి అతి క్లిష్టమైన ఆసనముల వరకు నిరంతర సాధన
  2. సప్త ధాతువుల నుండి, ప్రతి ఒక్క కణము వరకు ఆమూలాగ్రం శుద్ధి చేసే షట్ క్రియల సాధన
  3. నూతన కణముల ఉత్పాదన ద్వారా స్వాస్థ్య స్థాపనకై అత్యంత ప్రాచీన ప్రాణాయామ సాధన
  4. మానసిక వత్తిడి తగ్గించుకొని చైతన్యం ఏకాగ్రత పెంచుకొనుటకు ఉత్కృష్ట మైన ధ్యాన సాధన
  5. బాహ్య వాతావరణం తో పాటు అంతః శుద్ధి చేసే నిత్యాగ్ని హోత్ర విధానము లో శిక్షణ
  6. ఆయుర్వేద దినచర్య, వైదిక ఆహార సేవనలో వైద్య సుందర రాజ పెరుమాళ్ గారిచే శిక్షణ
  7. సులువుగా సంస్కృతం లో మాట్లాడడం నేర్పి సంస్కృత అధ్యయనము నకు గట్టి పునాది వేసే సంస్కృత సంభాషణ శిబిరం
  8. ప్రతీ రోజూ ఉచ్చారణ లోపం లేకుండా భగవద్గీత పారాయణం.
  9. జీవన విద్య శిక్షణ ద్వారా సంబంధాలను పటిష్టం చేసుకుని నిరంతర సుఖ సమృద్ధి సాధన కై మార్గ నిర్దేశనం చేయబడుతుంది.

    ఉచిత రిజిస్ట్రేషన్ : 8519970966, 9381341454 కు కాల్ చేసి పేరు నమోదు చేసుకొనవలెను.            

    గమనిక: కేవలం ఏడు రోజులు పూర్తిగా ఉండే వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఇవ్వబడును. అందుకై refundable deposit Rs1000 రిజిస్ట్రేషన్ సమయం లో తీసుకుని ఏడు రోజులు పాల్గొనిన తర్వాత తిరిగి ఇవ్వ బడును..

    గమనిక: 02-08-24 నుండి 03-08-24 వరకు సర్వం శైలేంద్ర గారిచే ప్రాచీన పద్ధతిలో ఫుడ్ fermentation శిబిరం నిర్వహింప బడుతుంది. అవకాశం ఉన్నవారు మొత్తం పది రోజులు ఉండి రెండు శిబిరముల లో పాల్గొన వచ్చును. రెండు శిబిరములకు విడి విడిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

    స్థానము: ఆరోగ్యధాత్రి ఆయుర్వేద పరిశోధనా సంస్థ, కోడూరు

    తేదీ: 26-07-24 నుండి 01-08-24 వరకు

    రిజిస్ట్రేషన్ కొరకై ఈ కింది ఫామ్ నింప గలరు

    https://forms.gle/WzDz2rxJohZho8kn9

    SARVAM HOLISTIC HEALTHY LIVING WORKSHOP 

    Sarvam Shailendra ji a sage scientist who is continuously striving to build a healthy society with the miracle fruits of his years of extraordinary research, is conducting a three day residential workshop named "Sarvam Holistic Healthy Living" at Arogyadhatri Ayurveda Research Institute from 01-08-24 to 04-08-24. This workshop helps us understand the right way of cooking, eating, drinking, cleaning, and living to achieve Holistic Health . This is a specialised workshop with following highlights

    1. Connecting with Pancha maha bhutas to revitalise our mind and body

    2. Understanding the science of true gut health 

    3.The Majestic Microbes  - Essence and Actions of Mircobes & Their

    Importance in attaining perfect health

    4. Right Cooking Methods - Insulation Hearth, Foam Removal, Processing food to remove anti nutrients. 

    5. Holistic and Stable Probiotics - Bio Salt, Kanjika, Fruit-Nut Buttermilks, Bio Veggies (Bio Salt Pickles/Veggies)

    6. The Right Water - Importance of Life in Water, Cellular Hydration, Sun-Moon Charging of water with Herbs to regenerate each and every cell of the body

    7. Probiotic Cleansing Rituals - to detoxify our body and surroundings without harming mother nature. 

    8. Live experiencing and tasting of Bio Salt dishes and probiotic food

    9. Nature connect - Earthing, Sun bathing, Tree connection, Moon gazing, Thought processing and gratitude prayer to rejuvenate our body and elevate our mental state. 

    https://youtu.be/B14Zhu4WXL0

    Fill the form below for registration 

    https://forms.gle/RPoybUbLPxgGVvBEA

    Contact 7411371799, 8519970966 for registration queries.  Dates: 1st to 4th August 2024 Venue: AROGYADHATRI AYURVEDA RESEARCH INSTITUTE, KODUR VILLAGE, VISAKHAPATNAM


    REGISTRATION FEES: RS 5000 including Course fee, food & Simple accommodation for 3 days

    "సర్వం సంపూర్ణ ఆరోగ్య జీవన శిబిరం" వర్క్ షాప్ 

    మానవాళి శ్రేయస్సు కై అహర్నిశలు తపిస్తూ ఆ తపః ఫలంతో స్వస్థ సమాజ నిర్మాణ యజ్ఞాన్ని నిరంతరం కొనసాగిస్తున్న మహర్షి 'సర్వం శైలేంద్ర' గారిచే ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో "సర్వం హోలిస్టిక్ హెల్తీ లివింగ్" అనే మూడు రోజుల ఆవాస శిబిరం నిర్వహింప బడుతోంది. 

    ఈ వర్క్‌షాప్ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడానికి సరైన పద్ధతిలో అహార నిర్మాణం, ఆహార సేవనం, జల సేవనం, అంతర్ బహి పరిమార్జనం మరియు సరైన జీవన విధానం ను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది. 

     01-08-24 నుండి 04-08-24 వరకు జరిగే ఈ ప్రత్యేక వర్క్ షాప్ లోని  ముఖ్యాంశాలు.

    1. పంచ మహా భూతాలతో అనుసంధానించడం ద్వారా మన మనస్సు మరియు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడం 

    2. నిజమైన గట్ హెల్త్ ను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం 

    3. ది మెజెస్టిక్ మైక్రోబ్స్ - మన లోని ఉన్న సూక్ష్మజీవుల  చర్యలు  & వాటి సహకారం ద్వారా  సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం

    4. సరైన ఆహార నిర్మాణం - ఇన్సులేషన్ హార్త్, ఫోమ్ రిమూవల్ & యాంటీ న్యూట్రియంట్స్ తొలగించి  ప్రాకృతిక పద్ధతి లో ఆహారాన్ని అమృత తుల్యంగా చేసే విధానంలో శిక్షణ

    5. హోలిస్టిక్ మరియు స్థిరమైన ప్రోబయోటిక్స్ - బయో సాల్ట్, కాంజికం, ఫ్రూట్-నట్ మజ్జిగలు, బయో వెజ్జీస్ (బయో సాల్ట్ పికిల్స్/వెజ్జీస్) నిర్మాణ విధానంలో శిక్షణ 

    6. జీవ జలం - నీటిలో జీవం యొక్క ప్రాముఖ్యత, సెల్యులార్ హైడ్రేషన్, శరీరంలోని ప్రతి కణాన్ని పునరుత్పత్తి చేయడానికి మూలికలతో  సూర్య-చంద్ర కిరణాలతో నీటిని శక్తివంతంగా చేయడం.

    7. ప్రోబయోటిక్ క్లెన్సింగ్ పద్ధతులు - భూమాతకు ప్రకృతికి హాని కలిగించకుండా మన శరీరం మరియు పరిసరాలను నిర్విషీకరణ చేయడం. 

    8. బయో సాల్ట్ వంటకాలు మరియు ప్రోబయోటిక్ ఆహారాన్ని ప్రత్యక్షంగా తయారు చేయడం మరియు రుచి చూడడం

    9. నేచర్ కనెక్ట్ - ఎర్తింగ్, సన్ బాత్, ట్రీ కనెక్షన్, మూన్ గేజింగ్, థాట్ ప్రాసెసింగ్ మరియు గ్రాటిట్యూడ్ ప్రేయర్ ద్వారా శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి మరియు మన మానసిక సుస్థిరత ను సాధించడం

    రిజిస్ట్రేషన్ కై ఈ క్రింది ఫారం నింప గలరు 

    https://forms.gle/RPoybUbLPxgGVvBEA

    రిజిస్ట్రేషన్ :  గూగుల్ ఫారం నింపాలి  లేదా పేరు నమోదు కై 7411371799,  8519970966 కు కాల్ చేయాలి

    స్థానము: ఆరోగ్యధాత్రి ఆయుర్వేద పరిశోధనా సంస్థ, కోడూరు గ్రామము  తేదీ: 01-08-24 నుండి  04-08-24 

    రుసుము: రూ 5000 రూపాయలు కోర్స్ ఫీజు, ఆహారము, సామాన్య వసతి కలిపి.

    SARVAM HOLISTIC HEALTHY LIVING WORKSHOP


    Arogyadhatri Ayurveda Research Institute

    39-5/15/3

    Near Bank Of Baroda, Muralinagar branch,

    Murali Nagar, Visakhapatnam,

    Andhra Pradesh 530007

    Phone Number: 089125 43778

    Arogyadhatri Ayurveda Ashram

    Murali Krishna Nagar, near SBI,

    Koduru,

    Andhra Pradesh 531002

    Email: aarogyadhatri@gmail.com

    Copyright © 2023 Arogyadhatri - Transforming Lives through Ancient Wisdom of Ayurveda and Yoga